సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలుపై వైఎస్సార్ సీపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా డబ్బు అందుతోందంటూ ట్వీట్ చేశారు. వీటన్నింటినీ చంద్రబాబు ఓర్వలేకపోతున్నారంటూ విమర్శించారు. 'సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఆదేశాలతో ఒకటో తేదీన వాలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇంకా చాలా చూడాలి. కళ్లలో నిప్పులు పోసుకోకు బాబూ' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. (అదే సీఎం జగన్ ఆశయం : విజయసాయిరెడ్డి)
కాగా మరో ట్వీట్‌లో ఏపీ రాజధాని అంశంపై చంద్రబాబు, ఎల్లో మీడియా అవలంభిస్తున్న విధానాలను కూడా ప్రస్తావించారు. 'రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత రెచ్చగొట్టినా ప్రజల నుంచి కనీస స్పందన లేదు. అమరావతి కృత్రిమ ఉద్యమాల వెనక ఉన్న అసలు కారణం అందరికీ అర్థమయింది. లాభం లేదని జోలె వదిలేసి కౌన్సిల్ పరిరక్షణ పోరాటం మొదలు పెట్టాడు బాబు. ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ('వారి కదలికలపై కుల మీడియా నిఘా')
Comments
Please login to add a commentAdd a comment