సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన శాసనసభ బిల్లు ఆమోదించిపంపితే శాసనమండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సభలో యనుమల రామకృష్ణుడు అవలంభించిన తీరుపై విజయసాయి రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. 'ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబు స్పీకర్‌గా తెరపైకి తీసుకొచ్చాడని, అదే విధంగా యనమల కూడా తన బాస్ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన 'చరిత్రలో నిల్చేంత' సేవ చేశారని విమర్శించారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్ఠను కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంటగలిపారని' మండిపడ్డారు. (మనుగడ కోసం బాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు)
కాగా.. మరో ట్వీట్‌లో 'అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుందంటూ' శాసనమండలిలో బాబు, యనుమల తీరుపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
చదవండి: (ఇది తప్పే..)
Comments
Please login to add a commentAdd a comment