
వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు సలాం బాబు
వైఎస్సార్ జిల్లా: ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ వివాదాస్పద నిర్ణయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సలాం బాబు మండిపడ్డారు. పిన్నమనేని నిర్ణయాలతో నిరుద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కారణంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరుద్యోగులు కోల్పోతున్నారని చెప్పారు. గ్రూప్ పరీక్షల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదు.. కనీస అనుభవం లేని పిన్నమనేనిని చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించడం దారుణమన్నారు.
నిరుద్యోగ యువతతో పిన్నమనేని చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి పిన్నమనేనిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని సలాంబాబు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment