
సిరిసిల్ల టౌన్: ట్వీటర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన కలెక్టర్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ రికార్డు సాధించారు. జిల్లాల పునర్విభజన తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ట్విటర్‌లో collrajannasircilla@collector_rsl ఖాతా తెరిచారు. ఇప్పటివరకు ఆయన 907 ట్వీట్‌లు పోస్టుచేశారు. ప్రజలు కూడా తమ సమస్యలను కలెక్టర్ ట్విటర్‌కు పోస్టు చేశారు.
స్థానిక పాతబస్టాండ్‌లో అపరిశుభ్రతపై ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు తొలుత కలెక్టర్ స్పందించి అధికారులతో తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తర్వాత పలు ట్వీట్‌లతో ప్రజలకు చేరువయ్యారు. ఆయన ట్వీటర్‌లో 2,003 మంది ఫాలోయర్స్ ఉండటం రాష్ట్రస్థాయిలో రికార్డు నెలకొల్పింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండోస్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment