Krishna Bhaskar
-
కలెక్టర్ ఆగ్రహం
-
మంగళ్లపల్లె ప్రత్యేక అధికారి సస్పెన్షన్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ విధులను నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. కోనరావుపేట మండలం మంగళ్లపల్లె ప్రత్యేక అధికారి ఆర్.రాజగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కృష్ణభాస్కర్ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజగోపాల్‌ను మంగళ్లపల్లెకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రత్యేక అధికారిగా నియమించారు. రాజగోపాల్ విధులను నిర్లక్ష్యం చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. జిల్లాలోని ముగ్గురు ఎంపీడీవోలతో సహా 52 మంది ప్రత్యేక అధికారులు, 52 మంది పంచాయతీ కార్యదర్శులకు బుధవారం రాత్రి మెమోలు జారీ చేశారు. గంభీరావుపేట, వేములవాడ రూరల్, బోయినపల్లి ఎంపీడీవోలకు కలెక్టర్ మెమోలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకే వీరికి మెమోలు జారీ అయ్యాయి. ముగ్గురు ఎంపీడీవోలు, 52 మంది ప్రత్యేక అధికారులు, 52 మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామపంచాయతీ కార్యదర్శి రాజును గ్రామసభకు గైర్హాజరు అయినందుకు ఇటీవలే కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఐదురోజుల వ్యవధిలో పదిర కార్యదర్శి రాజు, మంగళ్లపల్లె ప్రత్యేక అధికారి రాజగోపాల్ సస్పెండ్ కావడంతో చర్చనీయాంశమైంది. 107 మంది ఉద్యోగులకు ఒకేసారి మెమోలు ఇవ్వడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లె ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో కలెక్టర్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఉద్యోగులను ఉపేక్షించకుండా సస్పెండ్ చేయడం, మెమోలు ఇవ్వడం గమనార్హం. -
క్యాంటీన్లో కలెక్టర్ భోజనం
వేములవాడ: జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదివారం స్వామివారి క్యాంటీన్‌కు చేరుకుని సామాన్య భక్తుడిలా రూ. 25 చెల్లించి టోకెన్ తీసుకుని భోజనం చేశారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. అనంతరం స్వామి వారి క్యాంటీన్ భోజనం బాగుందంటూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్‌కు చెప్పారు. మెట్లపై కూర్చుండి షూ తొడుక్కుని తిరిగి వెళ్లిపోయారు. క్యాంటీన్‌కు చేరుకున్న కలెక్టర్‌ను చూసిన భక్తులు వావ్ కలెక్టర్ అంటా అని చెప్పుకున్నారు. రాజన్నను దర్శించుకున్న కలెక్టర్ వేములవాడ రాజన్నను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ క్యూలైన్లలో వచ్చి స్వామివారిని బయట నుంచే దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. నగరపంచాయతీ కమిషనర్‌పై ఫైర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, జాతరగ్రౌండ్ ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. అలాగే ప్రైవేట్ హౌస్‌లను లాడ్జ్‌లుగా నిర్వహిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ నగరపంచాయతీ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్‌పై జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఫైర్ అయ్యారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలనీ, ప్రైవేట్ లాడ్జ్‌ల లిస్టును తమకు సమర్పించాలని ఆదేశించారు. తక్షణమే వాటిని తొలిగిస్తామని కమిషనర్, కలెక్టర్‌కు సమాధానమిచ్చారు. పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్లోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అర్బన్ కాలనీ కేంద్రాన్ని డీఆర్వో తనిఖీ చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లకు తగు సూచనలు చేశారు. వారి వెంట తహసీల్దారు నక్క శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాటర్ బెడ్ పరిశీలన వేములవాడఅర్బన్: అర్బన్ మండలంలోని నాంపల్లిలో కరీంనగర్ డ్యామ్ నుంచి వేములవాడకు వచ్చే మంచినీటి వాటర్ బెడ్‌ను, నందికమాన్ నుంచి తిప్పాపూర్ వరకు రోడ్డును కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ విశ్వజిత్ అదివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి కోరత ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నాంపల్లి గుడికట్ట మీద ఉన్న పైపులైన్‌ను పరిశీలించారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్, డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, పట్టణ సీఐ వెంకటస్వామి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కలెక్టర్ ‘ట్వీటర్’ రికార్డు
సిరిసిల్ల టౌన్: ట్వీటర్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన కలెక్టర్‌గా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్ రికార్డు సాధించారు. జిల్లాల పునర్విభజన తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ట్విటర్లో collrajannasircilla@collector_rsl ఖాతా తెరిచారు. ఇప్పటివరకు ఆయన 907 ట్వీట్లు పోస్టుచేశారు. ప్రజలు కూడా తమ సమస్యలను కలెక్టర్ ట్విటర్‌కు పోస్టు చేశారు. స్థానిక పాతబస్టాండ్‌లో అపరిశుభ్రతపై ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు తొలుత కలెక్టర్ స్పందించి అధికారులతో తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. తర్వాత పలు ట్వీట్లతో ప్రజలకు చేరువయ్యారు. ఆయన ట్వీటర్లో 2,003 మంది ఫాలోయర్స్ ఉండటం రాష్ట్రస్థాయిలో రికార్డు నెలకొల్పింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండోస్థానంలో ఉన్నారు. -
జనశ్రీ బీమా.. భవితకు ధీమా
► నూరుశాతం నేతకార్మికులు సభ్యులుగా చేరాలి ► కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపు ► జనశ్రీ బీమా శిబిరం విజయవంతం సిరిసిల్ల టౌన్ : పేదకుటుంబాలకు చెందిన నేతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న జనశ్రీ బీమా యోజన అన్నివిధాలా ధీమానిస్తుందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీవైనగర్ చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా జనశ్రీ బీమా పేర్ల నమోదు శిబిరాన్ని ఆయన ప్రారంబిం చి మాట్లాడారు. నూరుశాతం కార్మికులు ఈ పథకంలో చే రాలని కోరారు. జేసీ యాస్మిన్ బాషా శిబిరాన్ని పర్యవేక్షిం చి కార్మికులకు బీమా రశీదులు అందించారు. బీమా ప్రిమీ యం రూ.470 ఉండగా జీవిత బీమా సంస్థ రూ.100, కేం ద్రప్రభుత్వం రూ.290 చెల్లిస్తాయని, కార్మికులు తమ వా టాగా రూ.80 చెల్లిస్తే సరిపోతుందని జేసీ వివరించారు. ఇందులోనూ పాలిస్టర్ వస్రో్తత్పత్తిదారులు ప్రతీకార్మికుడి పేరిట రూ.20 చెల్లించడానికి ముందుకు వచ్చారని, ఇక మిగిలింది రూ.60లేనని చెప్పారు. టెక్స్టైల్ ఏడీ అశోక్‌రా వు, మున్సిపల్ వైస్‌చైర్మన్ తౌటు కనుకయ్య, కౌన్సిలర్లు బ త్తుల వనజ, సైకాలజిస్టు పున్నం చందర్ పాల్గొన్నారు. రామన్నపల్లెలో కలెక్టర్ పర్యటన సిరిసిల్ల రూరల్ : తంగళ్లపల్లి మండలంలోని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న రామన్నపల్లిలో కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యటించారు. నగదు రహితంపై చేపట్టిన సర్వేను తనిఖీ చేశారు. బ్యాంకు ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్ పాసుపుస్తకాలు అందజేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఆర్డీవో మదన్ మోహన్, తహసీల్దార్ రమేశ్, సర్పంచ్ చిలివేరి రాజేశ్వరి తదితరులు ఉన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలి గంభీరావుపేట : నగదు రహిత లావాదేవీలు జరిపేలా ప్రజలను ప్రొత్సహించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ సూచిం చారు. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన దేశాయిపేటలో అధికారులతో క్యాష్‌లెస్ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, సర్పంచ్ మమత, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ఐకేపీ ఏపీఎం అహ్మద్ పాల్గొన్నారు. ‘నగదు రహితం’లో ఆదర్శంగా నిలువాలి ముస్తాబాద్ : నగదు రహిత ఆర్థిక లావాదేవీల్లో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన చీకోడ్‌లో నగదు రహిత లావాదేవీలపై అధికారులు, గ్రామస్తులతో సమీక్షించారు. అందరికీ ఏటీఎం కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఓబులేషు, డెప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, సర్పంచ్ రాజయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. -
తలాపునే జిల్లా కేంద్రం...
కండ్ల ముందుకొచ్చిన పాలన ఖుషీ...ఖుషీగా యువతరం వేములవాడ : ఇన్నేళ్లు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరభారం...వ్యయ ప్రాయాసాలు పడాల్సి వచ్చేది. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆభారం తగ్గిందని జనం సంబరపడిపోతున్నారు. సమయం సరిపోక ఇబ్బందులు పడిన వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల ప్రజానీకానికి కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజన్నసిరిసిల్ల జిల్లా ఆవిర్భావం కావడంతో తలాపునే జిల్లా కేంద్రం వచ్చేసిందంటూ జనం సంబరపడిపోతున్నారు. మొన్నటి వరకు ఇక్కడ్నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 35 నుంచి 50 కిలో మీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది, ఇప్పుడా తిప్పలే లేదంటూ ఖుషీ...ఖుషీగా కనిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీలతోపాటు ఇతర అధికారులను కలుసుకోవాలంటా ఇంటినుంచి హాయిగా భోంచేసి బయలుదేరే అవకాశాలు లభించాయని ఆనందపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల సంబరాలైతే ఆకాశన్నంటుతున్నాయి. అరవైయేండ్లుగా ఎదురుచూసిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జల్లాల ప్రక్రియను ముందేసుకుంది. 31 జిల్లాలను విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసింది. యువ ఆఫీసర్లను బాస్‌లుగా నియమించారు. ఇల్లు అలకగానే పండుగ కాదన్న చందంగా తొలి ప్రయత్నంలో కార్యాలయాలు హడావుడిగా ప్రారంభించిన ప్రభుత్వం, కార్యాలయాల్లో సిబ్బంది, పనితీరుపై దృష్టి సారించేందుకు చర్యలను ప్రారంభిస్తోంది. ఇప్పుడు జిల్లా స్థాయి అధికార యంత్రాంగం కాస్త అందుబాటులోకి వచ్చేసిందనీ, సులువుగా తమ కష్టసుఖాలు చెప్పుకోవచ్చన్న ఆశ జనంలో పెరిగిపోయింది. వెనుకబడిన వేలాది కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేందుకు కొత్త జిల్లాలు ఎంతో ఉపయోగపడతాయన్న సంబురం పెరిగిపోయింది. పేదల మోముల్లో కాస్త ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మంచిపాలనకు శ్రీకారం..... జిల్లా కేంద్రం సమీపంలో ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువవుతోందనీ, ఇంతేకాకుండా ప్రజలు సైతం తమతమ ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సులభతరమవుతోందన్న సదుద్దేశ్యంతో కొత్త జిల్లాలకు, నూతన పాలనావిధానానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్లా జిల్లా కేవలం 30 కిలో మీటర్ల పరిధిలోనే ఉండటంతో అంతా అలవోకగా జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం లభిస్తోంది. దీంతోపాటు వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ పరధులను ఏర్పాటు చేయడంతో గతంలో ఉన్న గ్రామాల సంఖ్య కుదింపు అయ్యింది. దీంతో ప్రభుత్వ పాలన మరింత సులభమవుతోందన్న వాదన వినవస్తోంది. అలాగే చందుర్తి మండలాన్ని రెండుగా విభజించారు. ఇందులో రుద్రంగా మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగించనున్నారు. అధికార యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, లేదా ప్రజల వద్దకే అధికారులు చేరుకోవాలన్న కాన్సెప్టుతో ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. చిన్నజిల్లా... తక్కువ కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన 31 జిల్లాలలో చిన్నజిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లానే. కేవలం 2.50 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌బాబు దసరా రోజున ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించిన తరుణంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ జిల్లాలోని 2.50 లక్షల కుటుంబాల వివరాలు మొత్తం జిల్లా కలెక్టర్ కంప్యూటర్లలో నింపబడి ఉంటాయనీ, ఏ కుటుంబం ఆర్థిక స్థితి, వారి జీవన విధానం, విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను ఇందులో పొందుపరచనున్నారు. దీంతో జిల్లా పాలన మరింత శరవేగంగా వృద్ధిచెందే అవకాశాలు మెండుగా ఉంటాయన్న భావన ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా పని చేసుకుంటూ తమతమ ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలనీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీ ఇక్కడే ఉంటారట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఇక్కడే ఉంటారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కలెక్టర్ వస్తురన్న విషయం ఇప్పుడిక కలెక్టర్, ఎస్పీ ఇక్కడే ఉంటారంటే మన సమస్యలు ఎంత త్వరగా తీరిపోతాయి. ఇది మంచి కార్యక్రమం. కొంత మందికి ఇబ్బందులు కలిగినా చాలా మందికి మాత్రం సంబరంగానే ఉంది. కొత్త జిల్లాల మన జిల్లా ముందంజలో ఉండాలి. పేదలకు సర్కూరు సేవలందాలి.... జనాభా ప్రాతిపదిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఈ ప్రాంతంలోని నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందే అవకాశాలు పెరిగాయి. ప్రజలకు అధికార యంత్రాంగం వారి సేవలను మంచిగా అందించాలి. కార్యాలయాల చుట్టూ తిప్పుకునే సంస్క ృతి పోవాలి. ఇంత దగ్గరికి ప్రభుత్వ పాలన వచ్చినా... ఇంకా ఒక్కో పనికి రోజుల తరబడి తిరిగే పరిస్ధితి రావోద్దు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది.