జనశ్రీ బీమా.. భవితకు ధీమా | collector krishna bhaskar about janasri insurance | Sakshi
Sakshi News home page

జనశ్రీ బీమా.. భవితకు ధీమా

Published Thu, Jan 5 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

జనశ్రీ బీమా.. భవితకు ధీమా

► నూరుశాతం నేతకార్మికులు సభ్యులుగా చేరాలి
► కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపు
► జనశ్రీ బీమా శిబిరం  విజయవంతం


సిరిసిల్ల టౌన్‌ : పేదకుటుంబాలకు చెందిన నేతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న జనశ్రీ బీమా యోజన అన్నివిధాలా ధీమానిస్తుందని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌ చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా జనశ్రీ బీమా పేర్ల నమోదు శిబిరాన్ని ఆయన ప్రారంబిం చి మాట్లాడారు. నూరుశాతం కార్మికులు ఈ పథకంలో చే రాలని కోరారు. జేసీ యాస్మిన్ బాషా శిబిరాన్ని పర్యవేక్షిం చి కార్మికులకు బీమా రశీదులు అందించారు. బీమా ప్రిమీ యం రూ.470 ఉండగా జీవిత బీమా సంస్థ రూ.100, కేం ద్రప్రభుత్వం రూ.290 చెల్లిస్తాయని, కార్మికులు తమ వా టాగా రూ.80 చెల్లిస్తే సరిపోతుందని జేసీ వివరించారు. ఇందులోనూ పాలిస్టర్‌ వస్రో్తత్పత్తిదారులు ప్రతీకార్మికుడి పేరిట రూ.20 చెల్లించడానికి ముందుకు వచ్చారని, ఇక మిగిలింది రూ.60లేనని చెప్పారు. టెక్స్‌టైల్‌ ఏడీ అశోక్‌రా వు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్  తౌటు కనుకయ్య, కౌన్సిలర్లు బ త్తుల వనజ, సైకాలజిస్టు పున్నం చందర్‌ పాల్గొన్నారు.

రామన్నపల్లెలో కలెక్టర్‌ పర్యటన
సిరిసిల్ల రూరల్‌ : తంగళ్లపల్లి మండలంలోని మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్న రామన్నపల్లిలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పర్యటించారు. నగదు రహితంపై చేపట్టిన సర్వేను తనిఖీ చేశారు. బ్యాంకు ఖాతాలు తెరిచిన వారికి కలెక్టర్‌ పాసుపుస్తకాలు అందజేశారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ డీఆర్‌డీవో మదన్ మోహన్, తహసీల్దార్‌ రమేశ్, సర్పంచ్‌ చిలివేరి రాజేశ్వరి తదితరులు ఉన్నారు.

నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించాలి
గంభీరావుపేట : నగదు రహిత లావాదేవీలు జరిపేలా ప్రజలను ప్రొత్సహించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సూచిం చారు. మంత్రి కేటీఆర్‌ దత్తత గ్రామమైన దేశాయిపేటలో అధికారులతో క్యాష్‌లెస్‌ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ ప్రసాద్, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మమత, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ఐకేపీ ఏపీఎం అహ్మద్‌ పాల్గొన్నారు.

‘నగదు రహితం’లో ఆదర్శంగా నిలువాలి
ముస్తాబాద్‌ : నగదు రహిత ఆర్థిక లావాదేవీల్లో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ దత్తత గ్రామమైన చీకోడ్‌లో నగదు రహిత లావాదేవీలపై అధికారులు, గ్రామస్తులతో సమీక్షించారు. అందరికీ ఏటీఎం కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ఓబులేషు, డెప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్, సర్పంచ్‌ రాజయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement