
నిధి అగర్వాల్, కేఎల్ రాహుల్
ముంబై : క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో పడ్డారా?. బాలీవుడ్ తారతో కలిసి ఉన్న రాహుల్ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువురూ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే సదరు వార్తలపై ఇప్పటివరకూ ఎవరూ స్పందించలేదు.
బాలీవుడ్ తార నిధి అగర్వాల్, క్రికెటర్ కే లోకేశ్ రాహుల్‌లు ముంబైలోని బాంద్రాలో జంటగా కనిపించారు. దీంతో బాలీవుడ్‌లో ఇప్పుడు వీరి గురించే హాట్ టాపిక్ అయింది. నిధి ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కూడా చేస్తున్నారు. నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో ఈమే కథానాయిక.
కాగా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున కేఎల్ రాహుల్ ఈ సీజన్ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment