
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలను బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ ఖండించారు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం రాహుల్, సోనాల్‌లు డేటింగ్‌లో ఉన్నారని ఏకంగా ఓ మీడియా కథనం ప్రచురించింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సోనాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కేఎల్ రాహుల్ మంచి క్రికెటర్. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడు. గొప్పవ్యక్తి. నేను అతనితో డేటింగ్‌లో లేను. ఈ విషయంలో ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే వార్తలను సృష్టించినవారిని ఆడగండి’అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తమ సంస్థ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వదంతులు సృష్టిస్తారని మండిపడ్డారు.
గతంలో రాహుల్ టాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. దీంతో ఆ వార్తలకు అక్కడే ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం సోనాల్‌తో డేటింగ్ వార్తలపై రాహుల్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి. రాహుల్ ప్రస్తుతం ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచకప్ తొలి పోరులో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో జూన్ 5న తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment