ఆడంబరాలకు కాస్త దూరంగా ఉంటూ రాష్ట్రానికి అండగా ఉండాలనే ఆలోచనతో ఓ నెటిజన్ విసిరిన 'సీఎం ఛాలెంజ్' ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ కామన్‌మెన్(సీఎం) మరో కామన్‌మెన్‌కు విసిరిన ఛాలెంజే ఈ సీఎం ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడంబరాలకు పోకుండా దుబారా ఖర్చులు చేయకుండా పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌ని ఆదర్శంగా తీసుకున్న ఆయన అభిమాని వెలగల సతీష్ రెడ్డి సీఎం ఛాలెంజ్ విసిరారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో వీక్షించండి.
రాజకీయ నాయకులకి బహుకరించే బొకేలు, శాలువాలు, జరుపుకునే విజయోత్సవాలు వీటిలో నుండి కాస్త డబ్బుని ఆదా చేసి దానిని సీఎం రిలీఫ్ ఫండ్‌కిగానీ లేదా ఇతర రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించమని అతను కోరాడు. తనవంతు బాధ్యతగా రూ. 10 వేలని సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇచ్చాడు. ఎవరైనా తనలా డబ్బు ఆదా చేసి విరళంగా ఇస్తే, ఆ రశీదుని సోషల్ మీడియాలో షేర్ చేసి దానికీ #cmchallenge అని ట్యాగ్ చేయమని కోరాడు. ఆ వీడియో సీఎం ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో హలచల్ చేస్తూ నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment