వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇవాంటినో
మాస్కో: సాకర్ సమరంలో ఆతిథ్య జట్టు రష్యా ఆరంభ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన పోరులో అద్భుత రీతిలో ఆడిన ఆతిథ్య జట్టు 5–0 తేడాతో జయభేరి మోగించింది. ఈ ఆరంభోత్సవానికి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇవాంటినోతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్ తిలకించిన వీరి సంభాషణపై ప్రస్తుతం నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. మ్యాచ్ ఆద్యంతం ఈ ముగ్గురు నవ్వుతూ, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. అయితే వీరి సంభాషణపై నెటిజన్లు సరదాగా జోకులు పేలుస్తున్నారు.
పుతిన్, సౌదీ యువరాజు సంభాషణ..
యువరాజు సల్మాన్: హే వ్లాద్, అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినందుకు ధన్యవాదాలు
పుతిన్: అఫ్‌కోర్స్! మీకు కూడా రిగ్ చేయాలా?
యువరాజు సల్మాన్: మాకు ఎన్నికలే ఉండవుగా.!
పుతిన్: మాకు కూడా అంతే..
పుతిన్: సారీ బ్రో, ప్రతిదీ డబ్బుతో కొనలేవు.
ఇవాంటినో: మీరు సాయం కోసం అమెరికాను సంప్రదిస్తారేమో..
సల్మాన్: గాయ్స్, ఒప్పందం కుదుర్చుకుందాం ప్లీజ్..
ఇలా ఊహా జనిత సంభాషణలతో సరదాగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment