మిర్పూర్: భారత్- బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే లో బంగ్లాదేశ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 200 పరుగులను దాటింది. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం తర్వాత..బంగ్లాదేశ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన షకీబ్(41), రహమాన్(40)లు బాధ్యతాయుతంగా ఆడి బంగ్లా స్కోరుని పరుగులు పెట్టించారు. దీంతో 37 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.