వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం
మిర్పూర్: భారత్- బంగ్లా తొలివన్డే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారత్తో గురువారం జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలూత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగన బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేసే సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓపెనర్లుగా వచ్చిన తమీమ్, సర్కార్లు వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టి తొలి వికెట్ కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మొదట నిధానంగా బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఓపెనర్లు...6వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్లో తమీమ్ ఇక్బాల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓపనర్లు ఇద్దరు ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. ఈ క్రమంలో సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. తమీమ్ ఇక్బాల్ 57 పరుగులు(52 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్), లిటన్ 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
స్కోర్ వివరాలు: 15.4 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 119/1
సర్కార్- 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)
తమీమ్ ఇక్బాల్- 57 పరుగులు(52 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్)
లిటన్-3
భారత్ బౌలింగ్:
భువనేశ్వర్ 4-0-27-0
ఉమేశ్ 3-0-28-0
అశ్విన్ 3-0-26-0
మోహిత్ 2.4-0-29-0
రైనా 3-0-8-0