
రాణిస్తున్న భారత బౌలర్లు.. ఆసీస్ 234/7
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ షమీ.. మిచెల్ జాన్సన్ను అవుట్ చేశాడు. జాన్సన్.. రహానెకు క్యాచిచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం రెండో సెషన్లో మూడు వికెట్లు తీసిన భారత్.. టీ విరామం తర్వాత కూడా మూడు వికెట్లు పడగొట్టారు.
ఉమేష్ యాదవ్.. బ్రాడ్ హాడిన్ను పెవిలియన్ చేర్చగా, ఇషాంత్ బౌలింగ్లో బర్న్స్ (9) వెనుదిరిగాడు. వీరిద్దరూ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఓవరాల్గా 299 పరుగుల ఆధిక్యంలో ఉంది.