మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్గా 200పైగా పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. రోజర్స్, మార్ష్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు అశ్విన్,ఇషాంత్, ఉమేష్ తలా వికెట్ తీశారు.
462/8 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మూడో టెస్టు: 200పైగా ఆధిక్యంలో ఆసీస్
Published Mon, Dec 29 2014 10:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement