inidia
-
‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
దేశంలోని వైద్యులకు సంబంధించిన ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ కమిషన్ పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, దీని ట్రయల్ రాగల ఆరు నెలల్లో ప్రారంభం కానున్నదని సమాచారం. ట్రయల్ అనంతరం ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ కింద దేశంలోని ప్రతి డాక్టర్‌కి యూనిక్ ఐడీ అందజేస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వైద్యునికి గుర్తింపు కల్పిస్తారు. ఈ ఐడీలో ఆ వైద్యుని శిక్షణ, అతని లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పత్రాల గురించిన సమాచారం ఉంటుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ ప్రత్యేక ఐడీని ఐటీ ప్లాట్ఫారమ్నకు లింక్ చేస్తుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర మాలిక్ మాట్లాడుతూ ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’పై ఇప్పటికే చాలా కసరత్తు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్యునికి రెండుసార్లు యూనిక్ ఐడీ ఇస్తారు. అతను ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన ఐడీ తాత్కాలికంగా ఉంటుంది. అతని చదువు పూర్తయ్యాక అతనికి శాశ్వత సంఖ్య ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు శాశ్వత యూనిక్ ఐడీ ఇస్తారు. ఈ ప్రత్యేకమైన ఐడీని అందుకున్న వైద్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో దాదాపు 14 లక్షల మంది నమోదిత వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. దేశంలోని 200కి పైగా మెడికల్ కాలేజీల్లో 1.08 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండటం అవసరం. అయితే భారతదేశం చాలా కాలం క్రితమే ఈ ప్రమాణాన్ని అధిగమించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ చెబుతోంది. ఇది కూడా చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు ‘వీర్యం నీరు’.. తరువాత జరిగిందిదే! -
‘స్వావలంబన భారత్’ ప్రపంచానికి దిశా నిర్దేశం
ప్రపంచంలో ఏ దేశానికైనా దాని బలమైన నాయకత్వం దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుంది. అలాగే ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అందరికీ ఆదర్శంగా నిలి చేలా చేస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం విశ్వ గురువుగా తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుందనీ, అది మరెంతో దూరం లేదనీ చెప్పవచ్చు. మోదీ భారత్ ప్రధానమంత్రి అవ్వడం నూతన శకానికి నాంది అయ్యిందని చెప్పవచ్చు. ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకునేలా భారత్ పురోగమిస్తోంది. వసు ధైక కుటుంబం అనే భావన ప్రాచీన కాలం నుంచీ భారత్ నమ్ముతోంది. ఈ భూమిపై ఉన్న సకల చరాచర జీవులనూ ఒకే కుటుంబంగా పరిగణిస్తూ అంతర్జాతీయంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. జీ20 దేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి చేరిందంటేనే భారత్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. జీ20 దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా 75 శాతం ప్రపంచ జీడీపీకి, 75 శాతం ప్రపంచ వర్తకానికీ, 66 శాతం ప్రపంచ జనాభాకీ ఒక మార్గదర్శిగా భారతదేశం మారిం దనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ ఘనత సాధించడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశం వివిధ దేశాలతో సాగించిన అంతర్జాతీయ వ్యవహారాలూ, అంతర్గతంగా దేశ ఆర్థిక స్థిరత్వానికీ ముందుచూపుతో మోదీ తీసుకున్న విధాన నిర్ణయాలూ కారణాలుగా చెప్పుకోవచ్చు. 2012లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం 11వ స్థానంలో ఉండగా 2022 సంవత్సరం నాటికి అది 5వ స్థానానికి ఎగబాకటం వెనుక ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ముఖ్యంగా నోట్లను రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన దొంగ నోట్ల చలామణీని అడ్డుకోవడం, బ్లాక్ మనీ నిర్మూలనా చేయగలిగాం. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ద్వారా లెక్కలలోకి రాకుండా ఉన్న అవ్యవస్థీకృత ఆర్థిక కార్యక్రమాలన్నీ స్థూల దేశీయోత్పత్తి గణనలోకి తీసుకురావడం జరిగింది. దీని వల్ల కేంద్ర ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. మేధో వలస లను నివారించి దేశ అభివృద్ధిలో మేధావులయిన యువతను ఉప యోగించుకోవడానికి ‘స్టార్ట్ అప్ ఇండియా’నూ, స్వదేశంలోనే మనకు కావలసిన వస్తూత్మత్తిని సాగించే ‘మేకిన్ ఇండియా’నూ కార్యరూపంలో పెట్టారు మోదీ. తద్వారా ఆర్థిక వ్యవస్థను మును పెన్నడూ లేని విధంగా బలోపేతం చేయడం జరిగింది. నైపుణ్యం ఉండి పెట్టుబడులు పెట్టడానికి మూలధనం లేని వారికి ‘ముద్ర యోజన’ పథకం ద్వారా నిధులను అందుబాటులోకి తేవడం, రాయితీలతో కూడిన మూలధనాన్ని అందించి సన్న, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది. ప్రపంచ దేశాలు ఈరోజు ఇంధన కొరత సమస్యతో ఇబ్బంది పడుతూ ద్రవ్యోల్బణంలోకి జారిపోతున్నాయి. అభివృద్ధి చెందా యని చెప్పుకొంటున్న అమెరికా, యూరప్ దేశాలలో ద్రవ్యో ల్బణం 7 శాతం పైగా నమోదు కాగా... భారతదేశంలో సుమారు 5 శాతం, లేదా మరి కొంత ఎక్కువగా నమోదయి స్థిరంగా కొన సాగుతోంది. ధరల నియంత్రణకు భారతదేశం తీసుకున్న ద్రవ్య, కోశ విధానాలతోపాటూ... రష్యా నుండి చౌకగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత 8 ఏళ్లుగా భారతదేశం సగటున 6.5 శాతంతో స్థిరమైన ఆర్థిక వృద్ధితో ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు భారతదేశం చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి మహిళలు ఉపయోగించే పిన్నీసులు, ఇతర గృహోపకరణాల దాకా తాను ఉత్పత్తి చేయకుండా దిగుమతులపై ఆధారపడడం జరి గింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ వచ్చింది. అదే సమయంలో చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్‌గా మారింది. గత ఎనిమిది సంవ త్సరాలుగా పీఎం మోదీ నాయకత్వంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలు వల్ల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్‌లో 2022 సంవత్సరానికి భార త్ 62వ స్థానానికి చేరుకుంది. 2012 –13 కాలానికి 192 దేశాలలో భారత్ స్థానం 133 లేదా 132 స్థానంలో ఉండేది. ప్రస్తుత ర్యాంకింగ్ భారతదేశం విదేశీ పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణం కలిగి ఉందో తెలియ జేస్తోంది. గత 22 ఏళ్లుగా (1999–2021) మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం విలువ 847 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో గత 8 (2014–2021) ఏళ్లలోనే 440 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 51 శాతంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మౌలిక సదుపాయాలు పెరిగాయి. దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తూ, విదేశీ చెల్లింపుల శేషం లోటును తగ్గించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక సమస్యలకూ, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలనూ తగ్గించడానికీ, ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించడానికీ అవకాశం ఉన్న జీ20కి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజలందరం ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా ఉంటూ ‘ప్రపం చానికి భారత్, భారత్‌కు ప్రపంచం’ అన్న నినాదంతో ముందుకు సాగుదాం. డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాసకర్త ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ -
న్యాయస్థానం మూడో సభ కాకూడదు
ఇటీవల దేశ న్యాయస్థానాలు సంచలన తీర్పులు, ఆశ్చర్యకరమైన ఆదేశాలు, కటువైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ప్రపంచ న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2018 జనవరి 12వ తేదీన నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ దేశ న్యాయవ్యవస్థ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. రెండేళ్ళ తర్వాత దేశంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ పరిణామాలను పరిశీలిస్తే వారు చెప్పింది నిజమేననిపిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కొంతకాలం క్రితం సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల్లో 50 శాతం మంది అవినీతిపరులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ మరో ముందడుగు వేసి సుప్రీంకోర్టులోని ఎనిమిది మంది న్యాయమూర్తులు అవినీతిపరులని ఆరోపిస్తూ, వారి పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసి, ధైర్యం ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. 2006 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమాపాల్, ‘‘ఉన్నత న్యాయస్థానాల్లోని వారు ఏడు రకాల పాపాలకు పాల్పడుతున్నారు. అవి సహచరుల అనైతిక ప్రవర్తనను పట్టించుకోకపోవడం, జడ్జీల నియామకంలో పారదర్శకత పాటించకపోవడం, గత తీర్పులను య«థాతథంగా కాపీ కొట్టడం, వ్యక్తిగతమైన అహంభావం, వృత్తిపరమైన అహంభావం, హిపోక్రసీ, ఆశ్రిత పక్షపాతం’’ అని వివరించారు. 1950 జనవరి 28వ తేదీన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ‘‘దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంట్ విధులకు న్యాయస్థానాల తీర్పులు ఆటంకం కాకూడదు. న్యాయవ్యవస్థ పార్లమెంట్ ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు’’ అని స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మన దేశంలో భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు కోర్టుల తీర్పులు, ఆదేశాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘పరిపాలనా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం అలా చేయాలి... ఇలా చేయకూడదు... అంటుంటే ఇక ఓట ర్లెందుకు? శాసన వ్యవస్థ ఎందుకు? ప్రభుత్వాలెందుకు?’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం జూలై రెండో తేదీన మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారంటే న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఏదో లోపం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ‘శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిధిలోకి న్యాయస్థానాలు రాకుండా లక్ష్మణరేఖ గీసుకోవాలి’’ అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే న్యాయం కోసం న్యాయవ్యవస్థపైనే ప్రజాప్రతి నిధులు పోరాటం చేస్తున్నారనిపిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు. 2010 మట్టూ ప్రియదర్శిని కేసులో సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ ఖట్జూ తీర్పునిస్తూ, ‘‘న్యాయ వ్యవస్థ స్వీయ నియంత్రణ పాటించాలి, సూపర్ లెజిస్లేచర్‌గా వ్యవహరించడానికి ప్రయత్నించకూడదు’’ అన్నారు. అమెరికన్ చరిత్రకారుడు ఆర్థర్ షెల్సింజర్ జూనియర్ 1947లో న్యాయమూర్తులు అత్యుత్సాహపరులు, ఆత్మనిగ్రహం పాటించి చట్టానికి లోబడి తీర్పులిచ్చేవారు, మధ్యేవాదులనే మూడు రకాలుగా ఉంటారని పేర్కొన్నారు. అయితే రెండో వర్గమైన అత్యుత్సాహపరుల కారణంగానే భవిష్యత్‌లో రాజ్యాంగ సంక్షోభాలు, న్యాయశాఖ, శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని రాజ్యాంగ నిపుణులు గతంలోనే హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిలో న్యాయవ్యవస్థ పాత్ర 1975 జూన్ 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన తీర్పు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడానికి పరోక్ష కారణమైందన్న విమర్శలు వచ్చాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 518 సీట్లకు గానూ 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేస్తూ గత ఎన్నికల్లో ఇందిర అనేక అవకతవకలకు పాల్పడినందున అమె ఎన్నికను రద్దు చేయాలని కోరారు. చేసిన అనేక ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోయారు. కోర్టు రెండు ఆరోపణల ఆధారంగా ఆమె ఎన్నిక చెల్లదని, ఆమె మరో ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చింది. ఈ ఆరోపణల్లో ఒకటి అప్పటికే ప్రధానిగా ఉన్న ఇందిర తన ఎన్నికల ప్రచార సభకు వేదిక ఏర్పాటు చేయడానికి పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగిం చడం. యశ్పాల్ అనే ప్రభుత్వ ఉద్యోగిని తన ఎన్నికల అవసరాల కోసం వాడుకున్నారన్నది ఆమెపై మరో అభియోగం. అయితే 1975 జూన్ 24న జస్టిస్ కృçష్ణ అయ్యర్ ఆమె కొన్ని షరతులతో ప్రధానిగా కొనసాగవచ్చని తీర్పు ఇవ్వగా, 1975 నవంబర్ ఏడో తేదీన సుప్రీంకోర్టు బెంచ్ అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, ఇందిర నిర్దోషని పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పునే ఎగువ కోర్టు కూడా సమర్థించే ప్రమాదం ఉందనే భయంతో ఆమె 1975 జూన్ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశప్రతిష్టను దెబ్బతీశారు. న్యాయ వ్యవస్థ అత్యుత్సాహం (జ్యుడీషియల్ యాక్టివిజం) అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. నాయమూర్తులు రాగద్వేషాలకు, బంధు, మిత్ర ప్రీతికి, అహంకారాలకు అతీతంగా పూర్తి అవగాహనలతో తీర్పులు ఇస్తుం టారు. అయితే శాసన, కార్యనిర్వాహక విభాగాలతో న్యాయ విభాగం కూడా రాజ్యాంగానికి లోబడి చట్టాలు, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలి. అవి తమతమ పరిధిలో ఉంటూ ఇతర వ్యవస్థలను తక్కువగా చూడకుండా ఉండాలి. లేకపోతే రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వి.వి.ఆర్.కృష్ణంరాజు వ్యాసకర్త ప్రెసిడెంట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మొబైల్ : 95052 92299 -
భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు
న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 83,883 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,407వేలకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29,70,493 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల 15 వేల 538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో 1.75 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,72,179 కరోనా పరీక్షలు నిర్వహించారు. చదవండి : చనిపోతున్న వారిలో వృద్ధులే అధికం -
ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. నానాటికి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికి ఈ వైరస్ కారణంగా దేశంలో ప్రతీ రోజు ప్రతి మూడు నిమిషాలకు ఓ ఇద్దరు మరణిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దాదాపు 941 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. ( 10 రెట్లు ప్రమాదకరంగా మారిన వైరస్! ) కాగా, దేశంలో కొత్తగా 57,982 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 50,921కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 19లక్షల మంది బయటపడ్డారు. సోమవారం నాటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల టెస్టులు చేసినట్టు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. -
భారత బౌలర్లు రాణించినా.. ఆసీస్‌కే!
-
భారత బౌలర్లు రాణించినా.. ఆసీస్‌కే!
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నాలుగో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. అయితే ఈ రోజు ఉదయం భారత టెయిలెండర్లు విఫలం కావడం.. తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడటం మనోళ్లకు ప్రతికూలాంశం. ఆసీస్ ఓవరాల్‌గా 326 పరుగుల ఆధిక్యంలో ఉండగా, చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌పై కంగారూలదే పైచేయి. నాలుగో రోజు భారత బౌలర్లు రాణించినా ఆసీస్ మ్యాచ్ ను శాసించే స్థితిలో ఉంది. సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 261 పరుగులు చేసింది. రోజర్స్ (69), షాన్ మార్ష్ (62 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్ ((40) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మార్ష్‌తో పాటు హారిస్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 462/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. . కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
రాణిస్తున్న భారత బౌలర్లు.. ఆసీస్ 234/7
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బౌలర్లు రాణిస్తున్నారు. ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ షమీ.. మిచెల్ జాన్సన్‌ను అవుట్ చేశాడు. జాన్సన్.. రహానెకు క్యాచిచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం రెండో సెషన్లో మూడు వికెట్లు తీసిన భారత్.. టీ విరామం తర్వాత కూడా మూడు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్.. బ్రాడ్ హాడిన్‌ను పెవిలియన్ చేర్చగా, ఇషాంత్ బౌలింగ్‌లో బర్న్స్ (9) వెనుదిరిగాడు. వీరిద్దరూ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఓవరాల్‌గా 299 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
మూడో టెస్టు: రాణిస్తున్న భారత బౌలర్లు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత బౌలర్లు రాణిస్తున్నారు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం రెండో సెషన్లో మూడు వికెట్లు తీసిన భారత్.. టీ విరామం తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టింది. తాజాగా ఉమేష్ యాదవ్.. బ్రాడ్ హాడిన్‌ను పెవిలియన్ బాటపట్టించాడు. హాడిన్ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయాడు. అంతకుముందు ఆసీస్ బ్యాట్స్‌మన్ బర్న్స్ (9) కూడా ఇషాంత్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచిచ్చాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత బౌలర్లు అశ్విన్, ఇషాంత్, ఉమేష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
మూడో టెస్టు: టీ విరామానికి ఆసీస్ 174/4
మెల్బోర్న్: భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ మరోసారి విజృంభించి రోజర్స్ (69)ను బౌల్డ్ చేశాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం టీ విరామానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. మార్ష్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు అశ్విన్ రెండు, ఇషాంత్, ఉమేష్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్‌గా 239 పరుగుల ఆధిక్యం సాధించింది. -
మూడో టెస్టు: 200పైగా ఆధిక్యంలో ఆసీస్
మెల్బోర్న్: భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్‌గా 200పైగా పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. రోజర్స్, మార్ష్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు అశ్విన్,ఇషాంత్, ఉమేష్ తలా వికెట్ తీశారు. 462/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
మెల్బోర్న్: భారత్‌తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం లంచ్ విరామం తర్వాత వర్షం తెరిపినివ్వడంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ కాసేపటికే వికెట్ చేజార్చుకుంది. 98 పరుగుల వద్ద వాట్సన్ (17)ను ఇషాంత్ అవుట్ చేశాడు. వాట్సన్ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయాడు. అంతకుముందు వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు. 462/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. -
మూడో టెస్టు: ఆగిన వర్షం.. మొదలైన మ్యాచ్
మెల్బోర్న్: వర్షం తెరిపినివ్వడంతో భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు నాలుగో రోజు ఆట మళ్లీ మొదలైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రోజర్స్, వాట్సన్ బ్యాటింగ్‌కు దిగారు. సోమవారం లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు గంటన్నర పాటు అంతరాయం ఏర్పడింది. అంతకుముందు 462/8 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
మూడో టెస్టుకు వర్షం అంతరాయం
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ నాలుగో రోజు లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. రోజర్స్ (33), వాట్సన్ (15) క్రీజులో ఉన్నారు. వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు. అంతకుముందు 462/8 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.