మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ నాలుగో రోజు లంచ్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. రోజర్స్ (33), వాట్సన్ (15) క్రీజులో ఉన్నారు. వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు.
అంతకుముందు 462/8 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (169), రహానె (147) సెంచరీలు సాధించారు. హారిస్ 4, జాన్సన్ 3, నాథన్ లియోన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 530 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మూడో టెస్టుకు వర్షం అంతరాయం
Published Mon, Dec 29 2014 8:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement