చోటివ్వలేదని తిడుతున్నారు.. సారీ | Aakash Claims Abuses Comments From Fans Over Dhoni Issue | Sakshi
Sakshi News home page

జరిగిందేదో జరిగిపోయింది నన్ను క్షమించండి

Published Wed, May 20 2020 7:11 PM | Last Updated on Wed, May 20 2020 7:11 PM

Aakash Claims Abuses Comments From Fans Over Dhoni Issue - Sakshi

హైదరాబాద్‌: ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వ్యాఖ్యతగా, విశ్లేషకుడిగా మారిన టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని ఫ్యాన్స్‌ ఆకాశ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ట్రోలింగ్‌ బెడదతో కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం. ఈ క్రమంలో అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ అతడు ట్వీట్‌ చేశాడు. ‘ కొందరు నన్ను, నా పిల్లలను తిడుతున్నారు. ఈ కారణంగా సోషల్‌ మీడియాకు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన విషయాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి’ అంటూ అభిమానులను ఆకాశ్‌ అభ్యర్థించాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే?  
అన్నీ కుదిరి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ నిర్వహిస్తే.. ఈ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును అంచనా వేశాడు ఆకాశ్‌ చోప్రా. ఈ క్రమంలో అతడు అంచనా వేసి ప్రకటించిన జట్టులో ధోనికి చోటు కల్పించలేదు. అంతేకాకుండా వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశాడు. దీంతో ఎంఎస్‌ ధోనికి జట్టులో  చోటు కల్పించకపోవడంతో అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నాడు ఈ మాజీ టెస్టు ఓపెనర్‌. దీంతో జరిగిన విషయం మరిచిపోయి తనను క్షమించాలని అభిమానులను ఆకాశ్‌ అభ్యర్థించాడు. దీంతో కథ దాదాపు సుఖాంతమైనట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.       

చదవండి:
పాక్‌పై ‘బౌలౌట్‌’ విజయం.. క్రెడిట్‌ అతడిదే!
'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement