కరాచీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ కు ఇంగ్లండ్కు వెళ్లే జట్టులో స్థానం కల్పించారు. గతంలో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్కు పాల్పడి ఐదు సంవత్సరాల నిషేధం ఎదుర్కోవడంతో ఆమిర్ కు యూకే హైకమిషన్ నుంచి వీసా మంజూరుపై స్పష్టత రావాల్సి ఉంది. అతని వీసాపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తబోవని భావిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అతనికి ప్రాబుబుల్స్ లో చోట కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఇటీవల భారత్ లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఆకట్టుకున్న ఆమిర్.. ఇంగ్లండ్ తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో అతన్ని ఎంపిక అనివార్యమైంది. ఈ మేరకు 17 సభ్యులతో కూడిన పాక్ జట్టును ప్రకటించారు.
పాక్ జట్టు:
మిస్బావుల్ హక్(కెప్టెన్), మొహ్మద్ హఫీజ్, సమీ అస్లామ్, షాన్ మసూద్, యూనిస్ ఖాన్, అజర్ అలీ, అసాద్ షఫిక్, ఇఫ్తికార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్, మొహ్మద్ రిజ్వాన్, యాసిర్ షా, జుల్ఫికర్ బాబర్, వాహబ్ రియాజ్, మొహ్మద్ ఆమిర్, రహత్ అలీ, ఇమ్రాన్ ఖాన్, సొహైల్ ఖాన్