సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ | AB de Villiers out with injury | Sakshi
Sakshi News home page

సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ

Published Sun, Feb 18 2018 5:45 PM | Last Updated on Sun, Feb 18 2018 5:49 PM

AB de Villiers out with injury - Sakshi

తొలి టీ 20లో టాస్‌ వేస్తున్న డుమినీ

జోహన్నెస్‌బర్గ్‌: మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ జేపీ డుమినీ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వన్డే సిరీస్‌ను గెలిచి ఆత‍్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా.. తొలి టీ20 సిరీస్‌లో కూడా శుభారంభం చేయాలని భావిస్తోంది. మరొకవైపు సఫారీలు వన్డేల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని మరచి సరికొత్త ఉత్సాహంతో సిరీస్‌ను ఆరంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే దక్షిణాఫ్రికా జట్టుకు చివరి నిమిషంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్వంటీ 20 స్పెషలిస్టు ఏబీ  డివిలియర్స్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఈ  సిరీస్‌లో డు ప్లెసిస్‌ సేవల్ని కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో కీలక ఆటగాడు కూడా దూరంగా కావడంతో సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొకవైపు భారత జట్టులోకి చాలాకాలం తర్వాత సురేశ్‌ రైనా పునరాగమనం చేశాడు. మనీష్‌ పాండే, ఉనాద‍్కత్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. కుల్దీప్‌ గాయం కారణంగా దూరం కావడంతో ఉనాద్కత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులో చేరాడు. భారత జట్టు ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల బలబలా పరంగా చూస్తే భారత జట్టే మెరుగ్గా ఉంది.

భారత తుది జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, ఎంఎస్‌ ధోని, భువనేశ్వర్‌ కుమార్‌, ఉనాద్కత్‌, చాహల్‌, బూమ్రా

దక్షిణాఫ్రికా తుది జట్టు: జేపీ డుమినీ(కెప్టెన్‌), డేవిడ్‌ మిలర్ల్‌, బెహర్దియన్‌, హెండ్రిక్స్‌, జేజే స్మట్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, క్రిస్‌ మోరిస్‌, ఫెహ్లుకోవాయో, డేన్‌ పాటర్సన్‌, జూనియర్‌ డాలా, షమ్సీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement