డర్బన్: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో రనౌట్‌గా నిష్క్రమించిన ఏబీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరపున అత్యధికసార్లు రనౌటైన అపప్రథను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జాక్వస్ కల్లిస్ చెత్త రికార్డును ఏబీ సవరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ 28సార్లు రనౌట్ అయ్యాడు. ఇదే సఫారీ తరపున అత్యధికం.
నాథన్ లయన్ వేసిన 12 ఓవర్ చివరి బంతిని క్రీజ్‌లో ఉన్న మర్‌క్రామ్ స్వ్కేర్ లెగ్ వైపు ఆడాడు. దాంతో రన్ కోసం మర్‌క్రామ్-ఏబీలు ప్రయత్నించారు. అయితే చివరినిమిషంలో పరుగు విరమించుకోవడంతో మర్‌క్రామ్ క్రీజ్‌లోకి వెళ్లిపోగా, అప్పటికే ముందుకొచ్చిన ఏబీ వెనక‍్కివెళ్లే యత్నం చేశాడు. అదే సమయంలో బంతిని వేగంగా అందుకున్న వార్నర్.. నాన్ స్టైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఆ బంతిని లయన్ అందుకోవడం వికెట్లను నేలకూల్చడం వేగంగా జరిగిపోయాయి. దాంతో ఏబీ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment