పోర్ట్ ఎలిజబెత్: ఏబీ డివిలియర్స్ (126 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ సెంచరీకి లోయర్ ఆర్డర్ పోరాటం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కీలక ఆధిక్యం సాధించింది. మిడిలార్డర్ విఫలమైన చోట టెయిలెండర్లతో కలిసి డివిలియర్స్ సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగుల ఆధిక్యాన్ని సాధించి పెట్టాడు. అనంతరం రబడ (3/38) మరోసారి రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.ప్రస్తుతం ఆ జట్టు 41 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిచెల్ మార్ష్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్), పైన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరు నాలుగో రోజు ఉదయం ఎలా బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 263/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికాను డివిలియర్స్ ఆదుకున్నాడు. ఫిలాండర్ (36; 5 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు, మహారాజ్ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో తొమ్మిదో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో కమిన్స్‌కు 3, హాజల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కంగారూలను రబడ మరోసారి వణికించాడు. వార్నర్ (13), ఖాజా (75; 14 ఫోర్లు), షాన్ మార్‡్ష (1)లను వెనక్కి పంపాడు. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో ఖాజా, మిచెల్ మార్ష్ ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో ఆసీస్ కోలుకోగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment