ఓటమికి చేరువగా అఫ్గానిస్తాన్‌ | Afghanistan Nearing Defeat Against West Indies | Sakshi
Sakshi News home page

ఓటమికి చేరువగా అఫ్గానిస్తాన్‌

Published Fri, Nov 29 2019 5:14 AM | Last Updated on Fri, Nov 29 2019 5:14 AM

Afghanistan Nearing Defeat Against West Indies - Sakshi

లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్‌ జట్టు ఓటమి ముంగిట్లో నిలిచింది. గురువారం రెండో రోజు ఆటముగిసే సమయానికి అఫ్గానిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. బౌలింగ్‌లో రకీమ్‌ కార్న్‌వాల్‌ (3/41), చేజ్‌ (3/10) చెలరేగడంతో అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ మళ్లీ తడబడ్డారు. ఓపెనర్‌ జావెద్‌ అహ్మదీ (62; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. మిగతా వారంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌ కేవలం 19 పరుగుల ఆధిక్యంలో ఉండగా 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 68/2తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్‌ 83.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటై 90 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందుకుంది. షామర్‌ బ్రూక్స్‌ (214 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీతో ఆకట్టుకున్నాడు. క్యాంప్‌బెల్‌ (55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా... డౌరిచ్‌ (42; 6 ఫోర్లు) రాణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement