టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పాల్గొనే అంశంపై సందిగ్ధత వీడింది.
భారత్‌లో టి20 ప్రపంచకప్‌కు...
కరాచీ: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పాల్గొనే అంశంపై సందిగ్ధత వీడింది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్‌కు వెళ్లేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టోర్నీ సందర్భంగా తమ జట్టుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. భారత్ వెళ్లేందుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలపడంపై పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఐసీసీ తమ జట్టుకు పూర్తిస్థాయి భద్రతను కల్పించాలని కోరారు. భారత్‌లో ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే టోర్నీకి మాత్రమే తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఒకవేళ టోర్నీ నుంచి వైదొలిగితే పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చేదన్నారు. మరోవైపు మ్యాచ్‌ల కోసం వందల సంఖ్యలో పాక్ అభిమానులు భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయని, వాళ్లకు తగిన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 16న క్వాలిఫయర్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తుంది.