సాక్షి, హైదరాబాద్: షేన్ వార్న్ బాల్ ఆఫ్‌ది సెంచరీ గుర్తుందా.. అదేనండి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ 1993 యాషెస్ సిరీస్‌లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మైక్ గ్యాటింగ్‌ను అవుట్ చేసిన బంతి గుర్తుండని క్రికెట్ అభిమాని ఉండరు. వార్న్ వేసిన బంతి లెగ్‌స్టంప్ వద్ద పిచ్ అవ్వగానే అనూహ్యంగా టర్నై ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టింది. ఈ బంతికి ఆశ్చర్యపోని వారుండరు. దీంతో ఈ బంతిని వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తున్నారు.
సరిగ్గా 24 ఏళ్ల తర్వాత అదే బంతిని విసిరి ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆసీస్ మహిళా స్పిన్నర్ అమంద-జేడ్ విల్లింగ్టన్. ఇది కూడా యాషెస్ సిరీస్‌లోనే నమోదు కావడం ఆశ్చర్యం. ఇంగ్లండ్ బ్యాట్స్‌ఉమెన్ ట్యామీ బ్యూమాంట్‌ను అలాంటే బంతితోనే బోల్తాకొట్టించి పెవిలియన్‌కు పంపింది. ఆమె వేసిన ఈ బంతిని వార్న్‌తో పోలుస్తుండటం విశేషం. ఇప్పుడు ఈ వీడియోను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు విల్లింగ్టన్ నుంచి స్టన్నింగ్ డెలివరీ అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది విల్లింగ్టన్ బాల్ ఆఫ్‌ది సెంచరీ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment