ఆ ఫొటోపై ట్రోల్స్‌.. స్పందించిన అనుష్క  | Anushka Sharma Breaks Silence On Troll Her Photo With Team India | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 5:56 PM | Last Updated on Mon, Aug 13 2018 5:59 PM

Anushka Sharma Breaks Silence On Troll Her Photo With Team India - Sakshi

టీమిండియాతో అనుష్కశర్మ

ముంబై : టీమిండియా అధికారిక కార్యక్రమానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ హజరవ్వడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అనుష్కశర్మ స్పందించారు. ఆమె నటించిన లేటేస్ట్‌ మూవీ ‘సూయి ధాగా’ మూవీ ట్రైలర్‌ విడుదలైన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ గ్రూఫ్ ఫొటోపై ఇప్పటికే వివరణ ఇవ్వాల్సిన వాళ్లు ఇచ్చారు. అదంతా ట్రోలింగ్. ఇలాంటి విమర్శలపై నేను స్పందించను. వాటిని పెద్దగా పట్టించుకోను. జరిగిందేదో జరిగిపోయింది. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయి. ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని  స్పష్టంచేశారు. (ఇంగ్లండ్‌ టూర్‌ ఆటకోసమా? హనీమూన్‌ కోసమా?)

ఇటీవల టీమిండియా ఆటగాళ్లు లండన్‌లో భారత హై కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ అధికారిక సమావేశాన్ని అనుష్కసైతం హాజరైంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్ల మధ్య కెప్టెన్‌ కోహ్లి పక్కన అనుష్క నిలబడటం అభిమానుల ఆగ్రహానికి తెప్పించింది. దీంతో వారు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌ నేపథ్యంలో కోహ్లి, అనుష్కల తప్పేం లేదని బీసీసీఐ కూడా వివరణ ఇచ్చింది. (చూడండి: సూయి ధాగా ట్రైలర్‌)

చదవండి: అనుష్క, కోహ్లిల తప్పేమీ లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement