లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుస రెండు టెస్టుల్లో ఓటమి పాలైన విరాట్ గ్యాంగ్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ప్రధానంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 159 పరుగులతో చిత్తుగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భారత క్రికెట్ బృందాన్ని టార్గెట్ చేస్తూ తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌గా నిష్క్రమించిన మురళీ విజయ్ స్థానాన్ని అనుష్క శర్మతో భర్తీ చేసే సమయం కోహ్లికి వచ్చేసిందంటూ ఒక అభిమాని చమత్కరించగా, ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్ ముగిసిపోవడంతో అనుష్కను కోహ్లి షాపింగ్ తీసుకెళ్లే అవకాశం లభించిందని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఇక్కడ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ తమ షాపింగ్ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు అభిమాని వ్యంగాస్త్రాలు సంధించాడు.
ఒకవేళ ఎవరిపైనైనా వేటు వేయాలని భారత క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే.. ముందుగా కోచ్ రవిశాస్త్రితో మొదలు పెడితే బాగుంటుందని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఇంత దారుణంగా ఓడిపోవడం జుగుప్సాకరంగా ఉందని, 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైనా పరాభవం కంటే ఘోరంగా ఉందని ఒక అభిమాని పేర్కొన్నాడు. ఆ సమయంలో యువకులతో ఉన్న భారత జట్టు పాఠాలు నేర్చుకోగా, ఇప్పుడు అనుభవం ఉన్న జట్టు సైతం ఏం చేసిందని ప్రశ్నించాడు. ఇలా అభిమానులు పంచ్‌లు మీద పంచ్‌లు కురిపిస్తూ టీమిండియా ఆటగాళ్లను తూర్పారబడుతున్నారు.
చదవండి: అదే కథ...అదే వ్యథ
నాకంటూ ప్రత్యేకత ఏమీ లేదు: హార్దిక్
Comments
Please login to add a commentAdd a comment