దుబాయ్: ఆసియా కప్ వన్డే టోర్నీ ఆరంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో భాగంగా గ్రూప్-బీలో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2016లో బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుర్రాళ్లతో కూడిన బంగ్లా జట్టును ఎదుర్కోవడం లంకేయులకు సవాల్‌తో కూడుకున్నదే. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్సీలో లంక బరిలో దిగుతోంది.
కీలక ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరమవడం లంకకు పెద్ద ఎదురుదెబ్బ. సీనియర్, జూనియర్ల కలయికతో ఉన్న జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లసిత్ మలింగా తుది జట్టులోకి రావడం లంకేయులకు కలిసొచ్చే అంశం. చివరిసారిగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా, ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్‌లో జరుగుతోంది. భారత్ తన తొలి మ్యాచ్ మంగళవారం (18న) హాంకాంగ్‌తో తలపడనుంది. మరుసటి రోజే దాయదీ పాకిస్తాన్ ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment