హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని భావిస్తున్న హైదరాబాద్ ఆశలు తీరేలా కనిపించడం లేదు. అస్సాంతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండో రోజు బుధవారం ఆట ముగిసే సరికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసింది. నెమ్మదైన పిచ్‌పై రెండు రోజులు గడిచినా రెండు ఇన్నింగ్స్‌లు కూడా పూర్తి కాకపోవడంతో ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఈ మ్యాచ్ ‘డ్రా’ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అంతకు ముందు 248/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన అస్సాం తమ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ధీరజ్ జాదవ్ (259 బంతుల్లో 74; 5 ఫోర్లు), తర్జీందర్ సింగ్ (129 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. హైదరాబాద్ బౌలర్లలో ఆకాశ్ భండారికి 3 వికెట్లు దక్కాయి.
అస్సాం 393 ఆలౌట్
Published Thu, Jan 15 2015 12:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement