బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 122 పరుగుల ఆరు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ విజయానికి ఆరు పరుగులు అవసరమై సమయంలో వరుసుగా రెండు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (28) పరుగుల వద్ద రనౌట్ కాగా, వెంటనే హడిన్ (1) పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు ఆసీస్ ఓపెనర్ రోజర్స్(55) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా. డేవిడ్ వార్నర్(6), షేన్ వాట్సన్(0)వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో మూడు వికెట్లు ఇషాంత్ దక్కగా, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించాయి.