అడిలైడ్: వరుస ఓటములతో డీలా పడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్ అవమానం తప్పించుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మూడో టెస్టులో ఆసీస్ 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోరుున ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్ కోసం ఐదు మార్పులతో బరిలోకి దిగి ఫలితం సాధించింది.
అరుుతే ఈ మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో గెలుచుకుంది. 127 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్‌సను ఆరంభించిన ఆసీస్ 40.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోరుు 127 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (51 బంతుల్లో 47; 7 ఫోర్లు), స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించారు. అంతకుముందు 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన ప్రొటీస్ 250 పరుగులకు ఆలౌట్ అరుు్యంది.
ఆసీస్‌కు ఊరట విజయం
Published Sun, Nov 27 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
Advertisement
Advertisement