అభిమానితో గొడవ పడుతున్న వార్నర్
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పోరు అభిమానులను కనువిందు చేస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల స్లెడ్జింగ్ తారాస్థాయికి చేరడంతో ఐసీసీ జరిమానా కూడా విధించింది. ఇక మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టాండ్స్‌లో ఉన్న అభిమానితో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ టీ20 తరహా ప్రదర్శనతో రబడ బౌలింగ్‌లో విరుచుకపడ్డాడు. తానేమి తక్కువ కాదనీ భావించిన రబడ వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అనంతరం బౌండరీలైన్‌ను దాటి మెట్లపై నుంచి పెవిలియన్‌కు వెళ్తుండగా గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని చప్పట్లతో అతనికి స్వాగతం పలుకుతూనే ఆగ్రహం తెప్పించే వ్యాఖ్యలు చేశాడు.
అవేమీ పట్టించుకోకుండా వెళ్తున్న వార్నర్‌తో పాటు అభిమాని కూడా ముందుకు నడుచుకుంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. వెనక్కి తిరిగి వచ్చిన వార్నర్ అభిమానికి తనదైన శైలిలో వాగ్వాదానికి దిగి వెళ్లిపోయాడు. వార్నర్ పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఎవరూ తగ్గలేదు. అయితే ఇద్దరి మధ్య బారికేడ్ మాత్రమే అడ్డుగా ఉంది. అభిమాని వ్యాఖ్యలపై మ్యాచ్ రిఫరీకి వార్నర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక తొలి టెస్టులో వార్నర్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌తో వాగ్వాదానికి దిగి జరిమానాకు గురైన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 255 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆతిథ్య జట్టుకు 56 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ సిరీస్‌లో ఆసీస్ పతనాన్ని శాసిస్తున్న రబడ మరోసారి నాలుగు వికెట్లతో రాణించగా మోర్కెల్ సైతం నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment