![సొంతగడ్డపై కరీబియన్లకు షాక్](/styles/webp/s3/article_images/2017/09/4/81467006056_625x300.jpg.webp?itok=9d0z2D-h)
సొంతగడ్డపై కరీబియన్లకు షాక్
బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో మిచెల్ మార్ష్ ఆల్ రౌండ్ షోతో పాటు హజ్లెవుడ్ సూపర్ స్పెల్తో విజృంభించడంతో ఆస్ట్రేలియా 58 పరుగులతో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై ఆదివారం జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్లో కరీబియన‍్లకు నిరాశ ఎదురైంది. మార్ష్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హజ్లెవుడ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ 45, రాందిన్ 40, హోల్డర్ 34 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు హజ్లెవుడ్ 5, మార్ష్ 3 వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీతో పాటు ఫించ్ 47, స్మిత్ 46, మార్ష్ 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లు హోల్డర్, గాబ్రియెల్ చెరో రెండు వికెట్లు తీశారు.