స్టీవ్ స్మిత్ అజేయంగానే.. | australia bowled out at 451 runs | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్ అజేయంగానే..

Published Fri, Mar 17 2017 1:28 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

స్టీవ్ స్మిత్ అజేయంగానే..

స్టీవ్ స్మిత్ అజేయంగానే..

రాంచీ:భారత్ తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(178 నాటౌట్; 361 బంతుల్లో 17 ఫోర్లు)  భారీ సెంచరీ సాధించి అజేయంగా క్రీజ్ లో నిలిచాడు. అతనికి జతగా మ్యాక్స్ వెల్(104;185 బంతుల్లో 9 ఫోర్లు) శతకం సాధించడంతో ఆసీస్ భారీ స్కోరు నమోదు చేసింది.


299/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ ఆదిలో కుదురుగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాడు మ్యాక్స్ వెల్ తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకోగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ జోడి 191 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. ఆపై వికెట్ కీపర్ వేడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు.వీరు 64 పరుగుల జోడించి తరువాత వేడ్(37;50 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. జడేజా బౌలింగ్ లో సాహాకు క్యాచ్ ఇచ్చిన వేడ్ అవుటయ్యాడు.

 

అయితే అదే ఓవర్ లో కమిన్స్ ను డకౌట్ గా జడేజా అవుట్ చేయడంతో ఆసీస్ 395 పరుగుల వద్ద ఏడో వికెట్ ను నష్టపోయింది. దాంతో రెండో రోజు లంచ్ సమయానికి ఆస్టేలియా ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. తొలి సెషన్ తరువాత ఓకీఫ్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 71 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన ఓకీఫ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత లియాన్(1)ను జడేజా పెవిలియన్ కు పంపాడు. ఆసీస్ చివరి ఆటగాడు హజల్ వుడ్ (0) రనౌట్ గా అవుటయ్యాడు. మరొకవైపు స్మిత్ అజేయంగా క్రీజ్ లో నిలిచాడు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లతో మెరిశాడు.అశ్విన్ కు వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement