
జైపూర్: రైడింగ్‌లో ఆకట్టుకున్న బెంగళూరు బుల్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆరో విజయాన్ని సాధిం చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 35–32తో దబాంగ్ ఢిల్లీ జట్టుపై నెగ్గి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించిన బుల్స్ చివరివరకు దాన్ని కొనసాగించింది. బెంగళూరు జట్టు 23 రైడ్, 7 ట్యాకిల్ పాయింట్లతో అదరగొట్టింది. ఇరుజట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి.
బుల్స్ జట్టులో రోహిత్ కుమార్ 12 పాయింట్లు, అజయ్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ తరఫున రోహిత్ 17 సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. ట్యాకిల్‌లో స్వప్ని ల్ 3 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–27తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో యూపీ యోధ ఆడుతుంది.