మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్‌! | Bangladesh cricketer Arafat Sunny sentenced to jail by dhaka loca court | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్‌!

Published Mon, Feb 13 2017 1:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్‌!

మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్‌!

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌​ అరాఫత్‌ సన్నీపై మరో కేసు నమోదయింది. గర్ల్‌ ఫ్రెండ్‌ అభ్యంతరకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అరెస్టయి బెయిల్‌ పై బయటకు వచ్చిన ఈ క్రికెటర్‌.. తాజాగా మరో ​కేసులో చిక్కుకున్నాడు. క్రికెటర్‌ అరాఫత్‌ తన భర్త అని, ఆయనతో పాటు ఆమె తల్లి తనను కట్నం కోసం తరచూ వేధిస్తున్నాడని అతడి గర్ల్‌ ఫ్రెండ్‌ నస్రీన్‌ సుల్తానా ఫిర్యాదు చేసింది. మహిళలు మరియు పిల్లలు అణచివేత నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఢాకా స్థానిక కోర్టులో క్రికెటర్‌ ను, అతడి తల్లిని ప్రవేశపెట్టారు.

అరాఫత్‌ ను విచారించేందుకు ఏడు రోజుల కస్డడీకి అనుమతించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కేసు విచారించిన ఢాకా స్థానిక కోర్టు బంగ్లా క్రికెటర్‌ కు జైలుశిక్ష విధించారు. షాహదత్‌​ హుస్సేన్‌, రుబెల్‌ హుస్సేన్‌ ల తర్వాత అరెస్టయిన మూడో క్రికెటర్‌ అరాఫత​ సన్నీ. మొదట గర్ల్‌ ఫ్రెండ్‌ అని చెప్పిన నస్రీన్‌, తాను అరాఫత్‌ భార్యనని విచారణలో వెల్లడించింది. గర్ల్‌ ఫ్రెండ్‌(నస్రీన్‌) ఫొటోల కేసు వ్యవహారంలో అతడు దోషీగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అరాఫత్‌ బంగ్లాదేశ్‌ జాతీయ జట్టుకు 16 వన్డేలు, 10 ట్వంటీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. క్రికెటర్ల వ్యక్తిగత విషయాలపై తాము స్పందించబోమని బంగ్లా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement