బంగ్లాదేశ్‌కు 33... ఇంగ్లండ్‌కు 2 | Bangladesh v England: Hosts need 33 runs with two wickets left in Chittagong | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు 33... ఇంగ్లండ్‌కు 2

Published Mon, Oct 24 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

బంగ్లాదేశ్‌కు 33... ఇంగ్లండ్‌కు 2

బంగ్లాదేశ్‌కు 33... ఇంగ్లండ్‌కు 2

చిట్టగాంగ్: బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట చివరిరోజు బంగ్లాదేశ్ విజయానికి 33 పరుగులు అవసరంకాగా... ఇంగ్లండ్ నెగ్గాలంటే 2 వికెట్లు తీయాలి. 286 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం బరిలోకి దిగిన బంగ్లా ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్‌‌సలో 78 ఓవర్లలో 8 వికెట్లకు 253 పరుగులు చేసింది. క్రీజులో సబ్బీర్ రహమాన్ (93 బంతుల్లో 59 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తైజుల్ ఇస్లాం (23 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ ఓవర్ నైట్‌స్కోరుకు మరో 12 పరుగులు జోడించి 240 పరుగులకు ఆలౌటైంది. షకీబ్‌కు ఐదు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement