బంగ్లాదేశ్‌ ఘనవిజయం | Bangladesh Won Against Zimbabwe In One Day Test | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ ఘనవిజయం

Published Wed, Feb 26 2020 4:05 AM | Last Updated on Wed, Feb 26 2020 4:05 AM

Bangladesh Won Against Zimbabwe In One Day Test - Sakshi

ఢాకా: జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో నయీమ్‌ హసన్‌ (5/82), తైజుల్‌ ఇస్లామ్‌ (4/78) హడలెత్తించడంతో... ఓవర్‌నైట్‌ స్కోరు 9/2తో మంగళవారం ఆట కొనసాగించిన జింబాబ్వే తమ రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. దాంతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్, 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమైంది. కెప్టెన్‌ ఇర్విన్‌ (43; 6 ఫోర్లు, సిక్స్‌), మరూమ (41; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ముష్ఫికర్‌ రహీమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement