
ఆ ఏడుగురు ఆటగాళ్లకు అరగుండు చేశారు!
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లను అవమానపరస్తూ బంగ్లాదేశ్ మీడియా ఓవరాక్షన్ చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియాపై బంగ్లాదేశ్ మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. వరల్డ్ కప్ లో అంపైర్ల తప్పిదాలతోనే బంగ్లాదేశ్ పై టీమిండియా గెలిచిందని విరుచుకుపడ్డ ఆ దేశ మీడియా.. తాజాగా టీమిండియా ఆటగాళ్లను అవమానపరిచింది.
యువ బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ చేతిలో భారత ఆటగాళ్లు చావు దెబ్బతిన్నారంటూ ఆ దేశ ప్రధాన వార్తా పత్రిక ప్రోథోమ్ ఆలో ఓ పెద్ద సైజు ఫేక్ కట్టర్ ను ప్రచురించింది. ముస్తాఫిజుర్ చేతితో కత్తి పట్టుకుని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, అశ్విన్ లకు అరగుండు చేసినట్లు ఉన్న ఫోటోను ప్రచురించింది.