ఐదుసార్లు అశ్విన్ కు చిక్కాడు! | Ben Stokes dismissed 5times by ashwin in this series | Sakshi
Sakshi News home page

ఐదుసార్లు అశ్విన్ కు చిక్కాడు!

Published Sat, Dec 17 2016 10:16 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

ఐదుసార్లు అశ్విన్ కు చిక్కాడు!

ఐదుసార్లు అశ్విన్ కు చిక్కాడు!

చెన్నై: భారత్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 300 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్(5) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ శర్మ వేసిన అద్భుతమైన బంతికి బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతకుముందు శనివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్(6)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్కు క్యాచ్ ఇచ్చిన స్టోక్స్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు.

 

అయితే ఈ సిరీస్లో అశ్విన్ బౌలింగ్ లో స్టోక్స్ అవుట్ కావడం ఐదోసారి.  ఇలా అశ్విన్ బౌలింగ్ లో స్టోక్స్ అవుటయ్యే క్రమంలో అతని పరుగుల యావరేజ్ 18.8 గా ఉంది. ఈ సిరీస్  రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో, నాల్గో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో అశ్విన్ బౌలింగ్లో స్టోక్స్ నిష్ర్కమించాడు. మరొకవైపు ఈ రోజు ఆటలో తొలి ఆరు ఓవర్లలోనే ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement