1985 తరువాత అశ్విన్ | Ravichandran Ashwin Reaches Rare Landmark, First Man Since 1985 To Do So | Sakshi
Sakshi News home page

1985 తరువాత అశ్విన్

Published Tue, Dec 20 2016 1:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

1985 తరువాత అశ్విన్

1985 తరువాత అశ్విన్

చెన్నై:ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించిన భారత ఆల్ రౌండర్ రవి చంద్రన్ అశ్విన్..ఇంగ్లండ్ తో చివరి టెస్టులో కూడా ఒక అరుదైన ఘనతను నమోదు చేశాడు. అది కూడా 30 ఏళ్ల  రికార్డును అశ్విన్ సవరించాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అశ్విన్ 25 కు పైగా వికెట్లను, 250కి పైగా పరుగులను సాధించాడు. ఇలా ఒక సిరీస్లో 25 వికెట్లు, 250 పరుగులు సాధించడం దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి. 1985లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ బోథమ్ ఆ ఘనతను సాధించగా, ఆ తరువాత అశ్వినే మొదటి ఆటగాడు. యాషెస్ సిరీస్లో బోధమ్ 31 వికెట్లతో పాటు సుమారు 250 పరుగులను సాధించాడు.

కాగా, ఈ సిరీస్లో అశ్విన్ ఇప్పటివరకూ  28వికెట్లు తీయగా, 306 పరుగులను సాధించాడు.  గత 40 ఏళ్లకు పైగా కాలం నుంచి చూస్తే ఐదు టెస్టుల సిరీస్లో 26కు పైగా వికెట్లు, 294కు పైగా పరుగులు సాధించడం కూడా ఇదే తొలిసారి. 1966-67 సీజన్లో చివరిసారి దక్షిణాఫ్రికా ఆటగాడు  ట్రెవర్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో ట్రెవర్ ఈ మార్కును చివరిసారి సాధించాడు. ఐదో టెస్టు టెస్టు భారత తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్(67) హాఫ్ సెంచరీ సాధించాడు.  అంతకుముందు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అశ్విన్ 70 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 32 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 58 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేయగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 72 పరుగులు నమోదు చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement