
షికాగో (అమెరికా): మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన షికాగో మారథాన్‌లో కెన్యాకు చెందిన 25 ఏళ్ల బ్రిగిడ్ కోస్గె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 14 నిమిషాల 04 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. 16 ఏళ్లుగా పౌలా రాడ్‌క్లిఫ్ (బ్రిటన్–2గం:15.25 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోస్గె తిరగ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment