డి హాన్ (బెల్జియం): ప్రతిష్టాత్మక 2017 చాలెంజ్ బెల్జియం ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన శరత్ కమల్ జోడీ కాంస్యాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్ కమల్– జి సతియాన్ (భారత్) జంట 2–3 (7–11, 11–7, 11–5, 5–11, 5–11)తో రెండో సీడ్ ప్యాట్రిక్ ఫ్రాంజిస్కా– రికార్డో వాల్తర్ (జర్మన్) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది.
సింగిల్స్ విభాగంలో సానిల్ శెట్టి, మహిళల డబుల్స్‌లో మనీకా బాత్రా– మౌమా దాస్ ద్వయం క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు. తొలి రెండు రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో సీడెడ్ ఆటగాళ్ల (కార్డిక్ నైటింక్, చెంగ్ టింగ్ లియావో)ను ఓడించిన సానిల్ శెట్టి క్వార్టర్స్‌లో 1–4తో రికార్డో వాల్తర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మనీకా– మౌమా జంట 1–3తో హియెన్ తైజు చెంగ్– హింగ్ యిన్ లియు (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment