
కార్పొరేట్ ట్రోఫీ విజేత కాగ్
ఫైనల్లో కెంప్లాస్ట్ చిత్తు
ముంబై: మీడియం పేసర్ల అండతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జట్టు బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ కెంప్లాస్ట్ జట్టును 32 పరుగుల తేడాతో ఓడించింది. వాంఖడే మైదానంలోని బౌన్సీ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కాగ్ 46.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రమీజ్ ఖాన్ (80 బంతుల్లో 41; 3 ఫోర్లు), అవీ బరోత్ (41 బంతుల్లో 35; 4 ఫోర్లు) రాణించారు. సందీప్ శర్మ ఐదు వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెంప్లాస్ట్ 46.3 ఓవర్లలో 178 పరుగులు చేసి ఓడింది. ఇంతియాజ్ అహ్మద్ (5/21)తో పాటు రితురాజ్ సింగ్ (3/32) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. హేమంత్ కుమార్ (85 బంతుల్లో 49; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. చివరి 10 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సినదశలో ఇంతియాజ్ రెండు వికెట్లు తీసి కాగ్‌ను గెలిపించాడు. విజేత కాగ్ జట్టుకు రూ.కోటి, రన్నరప్ కెంప్లాస్ట్‌కు రూ.50 లక్షలు దక్కాయి.