ఫైనల్లో కెంప్లాస్ట్, కాగ్ | Chemplast,kong entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కెంప్లాస్ట్, కాగ్

Published Fri, Feb 21 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

Chemplast,kong entered in finals

 బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ
 ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ ఫైనల్లో కెంప్లాస్ట్, కాగ్ (సీఏజీ) జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. గురువారం ముంబైలో జరిగిన తొలి సెమీఫైనల్లో కాగ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఇండియా సిమెంట్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సిమెంట్స్ 40.1 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. బద్రీనాథ్ (51) అర్ధసెంచరీ చేశాడు. ఇంతియాజ్ అహ్మద్ 4, రమీజ్ ఖాన్ 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కాగ్ 32.1 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసి నెగ్గింది.

 
  అంకిత్ లాంబా (59), బ్రావిష్ శెట్టి (39) రాణించారు.
 అహ్మదాబాద్‌లో జరిగిన రెండో సెమీస్‌లో కెంప్లాస్ట్ 2 వికెట్ల తేడాతో బీపీసీఎల్‌ను ఓడించింది. ముందుగా బీపీసీఎల్ 49.3 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ నాయర్ (57), మనీష్ పాండే (52), ఇండూల్కర్ (42), యాదవ్ (38)లు రాణించారు. సుతేశ్, పరమేశ్వరన్, పీయూష్ చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత కెంప్లాస్ 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఎన్‌స్టైన్ (74), హేమంత్ (60), అశ్విన్ (44), సతీష్ (27) మెరుగ్గా ఆడారు. నెట్రవాల్కర్ రెండు వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement