విరాట్ ఆ రికార్డు కూడా సాధిస్తాడా? | Can Virat Kohli become the first batsman in IPL history to score 1000 runs in a season? | Sakshi
Sakshi News home page

విరాట్ ఆ రికార్డు కూడా సాధిస్తాడా?

Published Sun, May 29 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

విరాట్ ఆ రికార్డు కూడా సాధిస్తాడా?

విరాట్ ఆ రికార్డు కూడా సాధిస్తాడా?

సూపర్ ఫామ్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్గా, ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. ఓ ఐపీఎల్ సీజన్లో వెయ్యి పరుగులు చేసిన తొలి క్రికెటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశముంది. ఐపీఎల్ తాజా సీజన్లో కోహ్లీ ప్రస్తుతం 919 పరుగులు చేశాడు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఫైనల్లో విరాట్ మరో 81 పరుగులు చేస్తే 1000 పరుగులు పూర్తవుతాయి. విరాట్ ఫీట్ సాధిస్తే కొత్త రికార్డు నెలకొల్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement