ఆహా ఏమి రుచి! | Chris Gayle gorges on 'Chingri Macher Malai Curry', Rosogolla | Sakshi
Sakshi News home page

ఆహా ఏమి రుచి!

Published Sun, Nov 10 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

ఆహా ఏమి రుచి!

ఆహా ఏమి రుచి!

కోల్‌కతా: మైదానంలో పరుగుల సునామీ సృష్టించే విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్... భారతీయ వంటకాల రుచికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ‘చింగిడి మచర్ మలై కరీ (కొబ్బరి నీళ్లతో చేసిన రొయ్యల కూర)తో విందు ఆరగించిన అతను మిస్తీ డోయ్, రసగుల్లా తిని ఫిదా అయిపోయాడు.
 
  రెండో టెస్టు కోసం ముంబై బయలుదేరే ముందు సాల్ట్‌లేక్ రెస్టారెంట్‌కు భోజనానికి వచ్చిన గేల్‌కు ప్రఖ్యాత బెంగాలీ వంటకాలను రుచి చూపెట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన రొయ్యల కూరను ఫోర్క్, కత్తితో తినడానికి ప్రయత్నించి విఫలమైన ఈ ఆల్‌రౌండర్ తర్వాత చేత్తో సుష్టుగా ఆరగించాడు.

 ‘భారత్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడి ప్రజలు తింటున్నట్లు మనం కూడా ప్రయత్నించాలి’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌కు కూడా చింగిడి మచర్ మలై కరీ అంటే చచ్చేంత ఇష్టం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement