
బంతితోనూ మెరిసిన గేల్!
విధ్వంసం అంటే ఎలా ఉంటుందో తన బ్యాట్తో ఇటు ప్రేక్షకులకు, ఇటు జింబాబ్వే ఆటగాళ్లకు రుచి చూపించిన విండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్.. ఇటు బంతితో కూడా మెరిశాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసుకుని తన ఆల్రౌండ్ ప్రతిభను చూపించాడు. 41 బంతుల్లోనే 52 పరుగులు సాధించి, జింబాబ్వే స్కోరుబోర్డును చకచకా పరుగులు తీయిస్తున్న ఎర్విన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే మట్సికెన్యెరిని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపాడు.
అంతకుముందు 177 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే జట్టు నిలకడగా రాణిస్తూ 226 పరుగుల వరకు వికెట్ పడకుండా కాపాడుకుంది. అయితే.. ఉన్నట్టుండి గేల్ రంగంలోకి దిగడంతో తక్కువ పరుగుల తేడాతోనే రెండు వికెట్లు టపటపా రాలిపోయాయి. 226 పరుగుల వద్ద ఎర్విన్ ఆరో వికెట్గాను, ఆ తర్వాత మరో 13 పరుగులకే మట్సికెన్యెరి వెనుదిరిగారు. దాంతో ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందడానికి క్రిస్ గేల్కు ఎలాంటి అడ్డంకి లేనట్లు అయ్యింది.