
గేల్ డబుల్ సెంచరీ.. ప్రపంచ కప్ రికార్డు
కాన్బెర్రా: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించాడు. ప్రపంచ కప్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా, వెస్టిండీస్ జట్టు తరపున వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా గేల్ రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో మ్యాచ్లో గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. గేల్ 9 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ ఫీట్ నెలకొల్పాడు.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గేల్ సెంచరీ చేశాక.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా గేల్ ఘనత సాధించాడు. ఇంతకుముందు భారత ఆటగాళ్లు సెహ్వాగ్, సచిన్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లే కావడం విశేషం.