జింబాబ్వే లక్ష్యం 373 | windies sets 373 runs target to zimbaabwe | Sakshi
Sakshi News home page

జింబాబ్వే లక్ష్యం 373

Published Tue, Feb 24 2015 12:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

windies sets 373 runs target to zimbaabwe

కాన్ బెర్రా:   ప్రపంచకప్ లో భాగంగా  జింబాబ్వేతో జరిగిన పూల్ బి మ్యాచ్ లో వెస్టిండీస్ రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.  విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ ప్రపంచ కప్ రికార్డు నెలకొల్పాడు.

టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే విండీస్ ఓపెనర్ స్మిత్ ను అవుట్ చేసి.. తొలి ఇరవై ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాచ్ ముగిసే సరికి విండీస్ కు ఇన్ని పరుగులు సమర్పించుకుంటుందని ఊహించి ఉండరు. కానీ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ కు తోడు శామ్యూల్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ భారీ స్కోరు నమోదు చేసింది. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 215 పరుగులు చేసిన గేల్.. మసకద్జా వేసిన చివరి ఓవర్ ఆఖరు బంతికి చిగుంబరకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 156 బంతులు ఎదుర్కొన్న మార్లన్  శ్యామ్యూల్స్ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 133 పరుగులుచేసి నాట్ అవుట్ గా నిలిచాడు.  జింబాబ్వే బౌలర్లలో పన్యగర, మసకద్జా చెరో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement