క్రిస్ గేల్ విధ్వంసకాండ ఎలా సాగిందంటే.. | gayle creates history | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ విధ్వంసకాండ ఎలా సాగిందంటే..

Published Tue, Feb 24 2015 1:26 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

gayle creates history

కాన్ బెర్రా: తుపాను, సునామీ, విధ్వంసం, విస్పోటనం.. ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో కాన్ బెర్రా మనుకా ఓవల్లో అలాంటి దృశ్యం ప్రత్యక్షమైంది. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గేల్ సృష్టించిన పరుగుల సునామీలో జింబాబ్వే బౌలర్లు గల్లంతయ్యారు. సింగిల్స్ కంటే ఫోర్లు, సిక్సర్లు బాదడమే సులువన్నట్టుగా గేల్ రెచ్చిపోయాడు. జింబాబ్వే ఆటగాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోగా.. ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారిపోయారు. ప్రపంచ కప్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఈ జమైకా స్టార్ క్రికెటర్  చరిత్ర పుటలకెక్కాడు. అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా, తొలి విండీస్ క్రికెటర్గా ఘనత సాధించాడు. 50 బంతుల్లో 50.. 105 బంతుల్లో 100.. 126 బంతుల్లో150.. 138 బంతుల్లో 200 ఇలా గేల్ విధ్వంసకాండ కొన సాగింది.  ఓవర్ల వారీగా

తొలి ఓవర్: పన్యగర బౌలింగ్ లో చివరి బంతికి రెండు పరుగులతో వేట మొదలెట్టాడు.
నాలుగో ఓవర్: చటారా బౌలింగ్ తొలి ఫోర్
ఆరో ఓవర్:చటారా బౌలింగ్లోనే రెండు ఫోర్లతో అలరించాడు.
11వ ఓవర్: విలియమ్స్ వేసిన ఓవర్లో తొలి సిక్సర్ సంధించాడు.
15వ ఓవర్: విలియమ్స్ బౌలింగ్లో మరో ఫోర్
18వ ఓవర్: చిగుంబుర బౌలింగ్లో సిక్సర్, సింగిల్తో హాఫ్ సెంచరీ
20వ ఓవర్: చిగుంబర బౌలింగ్లోనే ఫోర్
26వ ఓవర్: కముంగోజి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు
29వ ఓవర్: సికిందర్ రాజా బౌలింగ్లో మరో సిక్సర్
36వ ఓవర్: మసకద్జ బౌలింగ్లో సింగిల్తో 22వ వన్డే సెంచరీ. ఇదే ఓవర్లో సిక్సర్
38 వ ఓవర్: పన్యగర ఓవర్లో ఫోర్, సిక్సర్
40వ ఓవర్: పన్యగర ఓవర్లోనే మరో సిక్సర్. ఇదే ఓవర్లో గేల్ క్యాచ్ అవుటయ్యాడు. అయితే అంపైర్ నోబాల్గా ప్రకటించాడు.
41వ ఓవర్: మసకద్జ బౌలింగ్లో సిక్సర్
42వ ఓవర్: చిగుంబుర ఓవర్లో సిక్సర్
43వ ఓవర్: విలియమ్స్ బౌలింగ్లో 150 పరుగులు పూర్తి
44వ ఓవర్: కముంగొజి బౌలింగ్లో వరుసగా 6, 4, 6, 4. ఇదే ఓవర్లో వన్డేల్లో గేల్ (157) అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు.
45వ ఓవర్: విలియమ్స్ ఓవర్లో వరుసగా 6, 6, 6. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు (189) చేసిన ఆటగాడిగా రికార్డు. దక్షిణాఫ్రికా ఆటగాడు కిర్ స్టెన్ (యూఏఈపై 188) రికార్డు బ్రేక్.
46వ ఓవర్: చటారా బౌలింగ్లో 6, 4, 4. డబుల్ సెంచరీ నమోదు. ప్రపంచ కప్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
48వ ఓవర్: శామ్యూల్స్తో కలసి 332 పరుగుల భాగస్వామ్యం. వన్డేల్లో ప్రపంచ రికార్డు
50వ ఓవర్: ఆఖరి బంతికి గేల్ (215) నిష్ర్కమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement